రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ గందరగోళం.. సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
Parliament Meeting: రెండోరోజు హాట్ హాట్‌గా పార్లమెంట్ సెషన్స్
Parliament Meeting: రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ఇక అటు 12 మంది ఎంపీల సస్పెన్షన్ వేటు రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది.
ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని, ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు, ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సభ్యులు క్షమాపణ చెప్పాలని సూచించారు. దానికి ఖర్గే నిరాకరించారు. దీంతో విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.