Operation Ganga: ఆపరేషన్ గంగా ముమ్మరం
Operation Ganga: 1800 మందిని తీసుకురానున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి
Operation Ganga: అపరేషన్ గంగాను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మరో 9 విమానాలను పంపుతోంది. ఈ విమానాలు మార్చి 4న హంగేరిలోని బుచారెస్ట్, బుడాఫెస్ట్, ర్జేసో విమానాశ్రయాలకు చేరుకోనున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెక్స్, ఇండిగోకు చెందిన ఈ 9 విమానాల్లో 18వందల మంది విద్యార్థులను తరలించనున్నట్టు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత ఉన్నతస్థాయిలో జరిగిన సమావేశం తరువాత భారత వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు హంగేరి, రొమేనియా నుంచి భారతీయులను తీసుకుని.. భారత్‌కు చేరుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు టెంట్లు, దుప్పట్లతో పాటు ఇతర వస్తువులను తరలించాయి. మరో మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పోలాండ్, హంగేరి, రొమేనియా నుంచి తరలించనున్నాయి. గత 24 గంటల్లో 6 విమానాలు భారత్‌కు చేరుకున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ట్విటర్‌లో తెలిపారు.