సరఫరా తగ్గుముఖం పట్టడంతో ఎగబాకుతున్న ఉల్లిధరలు

డిమాండ్‌కి అనుగుణంగా సరఫరాలేక 50 శాతం పెరిగిన ధరలు

Update: 2024-06-11 12:11 GMT

సరఫరా తగ్గుముఖం పట్టడంతో ఎగబాకుతున్న ఉల్లిధరలు

ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. సరఫరా తగ్గుముఖం పట్టడంతో రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. పెరిగిన డిమాండ్‌కి అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50 శాతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్‌లో కిలో ఉల్లి ధర 17 నుంచి 26కి పెరిగింది. నాణ్యతతో కూడిన ఉల్లి ధర 30 రూపాయలు పలుకుతోంది. 2023-24 రబీ దిగుబడులు తగ్గాయని అంచనాలతో ధరలు పెరుగుతాయని రైతులు ఉల్లిని నిల్వ ఉంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Tags:    

Similar News