ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న ఉద్రిక్తత

* ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లబోమంటోన్న రైతులు * పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిరసనలు

Update: 2021-01-30 08:12 GMT

Representational Image

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు బోర్డర్ ఖాళీ చేయమన్నా పట్టు వీడటం లేదు రైతులు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లబోమంటూ ఆందోళనలు చేస్తున్నారు.

మరోవైపు నిన్నటి నుంచి ఆందోళనలకు యూపీ, హరి‍యాణా రైతుల నుంచి మద్దతు పెరుగుతోంది. వేలాదిగా తరలివస్తోన్న రైతులు సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌లకు చేరుకుంటున్నారు. దీంతో ఘాజీపూర్ బోర్డర్‌లో ట్రాక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇక నిన్న సింఘు బోర్డర్‌లో స్థానికులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఓ వైపు రైతులు ఖాళీ చేయమని పట్టుబడుతుంటే.. స్థానికులు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. వెంటనే సరిహద్దులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని సరిహద్దుల్లో భారీగా మోహరించారు పోలీసులు.

Full View


Tags:    

Similar News