Bay of Bengal: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Bay of Bengal: అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు * ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర మీద అధిక ప్రభావం

Update: 2021-07-13 06:54 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం (ఫైల్ ఇమేజ్)

Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ వెల్లడిచింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, మధ్య పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 65 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడింది. దాంతో మత్స్యకారులు ఈనెల 15వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News