Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి

Coronavirus: రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. * రోజూ వందలాది మంది మృతి చెందుతున్నారు.

Update: 2021-03-30 08:12 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రోజూ వందలాది మంది మృతి చెందుతున్నారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. సోమవారం 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే 271 మంది మృతి చెందగా, 37,028 మంది కోలుకున్నారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు చేరింది. మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. 5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తించడం ఆందోళన కలిగిస్తుంది.

మొదట్లో వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ త్వరగా వ్యాప్తి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆరంభంలో తక్కువ టెస్ట్ లు చేయడం, అవగాహన లేకపోవడం వల్ల తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు టెస్టింగ్స్ సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

వైరస్ లో వచ్చే మార్పులను మ్యుటేషన్స్ అంటారు. ఇప్పటి వరకు కరోనాలో అనేక మ్యుటేషన్స్ వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్నాయి. మానవ శరీరంలోని స్పిక్ ప్రోటీన్ కి అంటుకొని వాటిని మార్చి శరీర కణాలకి మ్యుటేషన్స్ ప్రవేశించే అవకాశం ఉంది. ఇలాంటి వైరస్ వలన వ్యాప్తి ఎక్కువగా చెందడమే కాదు.. ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Tags:    

Similar News