PM Modi: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా అడుగులు
వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వన్ నేషన్-వన్ సివిల్ కోడ్ తో దేశంలో వివక్షకు తెరపడుతోందన్నారు.
PM Modi in Gujarat on Diwali: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వన్ నేషన్-వన్ సివిల్ కోడ్ తో దేశంలో వివక్షకు తెరపడుతోందన్నారు. గుజరాత్ లోని కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. తొలుత పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్, వన్ పవర్ గ్రిడ్ , వన్ నేషన్ -వన్ రేషన్ కార్డు విధానం తెచ్చాం.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కూడా తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందన్నారు.
గత ప్రభుత్వాల విధానాలతో ఐక్యతా భావాన్ని బలహీనపర్చాయని ఆయన విమర్శించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలను సాగనివ్వబోమని ఆయన అన్నారు. వన్ నేషన్- వన్ సివిల్ కోడ్ తో దేశంలో వివక్ష తెరపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.