Tamil Nadu: తమిళనాడులో మరో విద్యార్థిని బలవన్మరణం

Tamil Nadu: 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య

Update: 2022-07-26 11:30 GMT

Tamil Nadu: తమిళనాడులో మరో విద్యార్థిని బలవన్మరణం

Tamil Nadu: తమిళనాడులో విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపుతోంది. తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుని.. 24 గంటలు గడవముందే.. కడలూరుకు చెందని మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తమిళనాడులో కడలూరు ఘటనతో ఇది మూడోవది. తల్లి మందలించడంతోనే బాలిక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కల్లకురిచి జిల్లాల్లో ఈనెల 13న 17ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కల్లకురిచి జిల్లా రణరంగంలా మారింది. ఘటనపై విద్యార్థిని బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరువళ్లూరులోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆ సంస్థ హాస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న‌ట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని డీఐజీ సత్యప్రియ తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీసీఐడీకి బదిలీ చేసినట్లు వివరించారు. అంతకుముందు13న కల్లకురిచి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. టీనేజీ విద్యార్థుల మరణాలతో ఆందోళనకు గురైన తమిళనాడు ప్రభుత్వం 'మనవర్ మనసు' పథకం కింద పాఠశాల విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు 800 మంది వైద్యులను నియమించాలని నిర్ణయించింది.

Tags:    

Similar News