Omicron: భారత్‌లో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు

Omicron: దేశంలో 781 ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. 241 మంది డిశ్చార్జ్‌

Update: 2021-12-29 04:47 GMT

భారత్‌లో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు

Omicron: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఈ డెడ్లీ వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 781 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 కేసులు వెలుగు చూడగా గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 మంది ఈ వైరస్‌ బారిన పడినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాజస్థాన్‌లో 46, తమిళనాడు, కర్ణాటకలో 34 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక హరియాణాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఒడిశాలో 8, ఏపీలో 6, ఉత్తరాఖండ్‌లో 4, చండీగఢ్‌, జమ్ముకాశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2 చొప్పున కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, లద్దాఖ్‌, మణిపూర్‌లో ఒక్కో ఒమిక్రాన్‌ కేసు రికార్డయింది. ఇక ఒమిక్రాన్‌ నుంచి కోలుకుని పలు ఆస్పత్రుల నుంచి 241 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Tags:    

Similar News