Omicron Alert: దేశాల సరిహద్దులు మూసుకుపోతున్నాయి.. ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు షురూ..
Omicron Alert: దేశాల సరిహద్దులు మూసుకుపోతున్నాయి.
Omicron Alert: దేశాల సరిహద్దులు మూసుకుపోతున్నాయి. రెడ్ లిస్ట్ విదేశాలు పెరిగిపోతున్నాయి. కరోనా టెస్ట్‌లు తప్పనిసరి అవుతున్నాయి. మొత్తానికి దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్‌పై భారత్ ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది.
దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. వేగంగా వ్యాపిస్తున్న" ఒమిక్రాన్" పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎయిర్ పోర్టులోని అధికారులను, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేయగా ఎయిర్‌పోర్టులో టేస్టులను ప్రారంభించారు వైద్యులు.
భారత్ నుండి ఇతర దేశాలకు వెళ్ళేవారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్‌ను సమర్పించాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకుని వస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో సైతం ఎయిర్‌పోర్టులో టెస్ట్‌లు నిర్వహిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు తెలియజేస్తున్నారు.
ఒమిక్రాన్ కరోనాతో పోలిస్తే వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ, జాతీయ ఎయిర్‌పోర్టుల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా కొన్ని ఎయిర్‌పోర్టుల్లో ధర్మల్ స్య్కానింగ్ చేయడం లేదని, సిబ్బంది మాస్క్‌లు కూడా పెట్టుకోవడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. శానిటైజేషన్ విషయం మర్చిపోయారని చెప్పుకొచ్చారు. మొత్తానికి దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్‌పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ ప్రజలు ఒమిక్రాన్ బారినపడకుండా జాగ్రత్తలు చేపట్టింది.