Old Age Homes: పండుటాకులకు శాపంగా మారిన కరోనా

Update: 2020-07-27 06:32 GMT

Old Age Homes: కరోనా మహమ్మారి పండుటాకుల పాలిట శాపంగా మారింది. బిడ్డలకు దూరంగా ఆశ్రమాల్లో బతుకీడుస్తున్న వృద్ధులను కరోనా కలవరానికి గురిచేస్తోంది. ఎవరూ లేని అనాధాలను సైతం వైరస్ భూతం టార్గెట్ చేసింది. రక్తసంబంధీకులకు దూరంగా బతుకు భారంగా ఆశ్రమాల్లో సేదదీరుతున్న పండుటాకుల లైఫ్ కరోనా కాలంలో ఎలా ఉందో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కపోతుంది.

ఎవరూ లేని అనాథలు.. అందరున్న అనాథలు సేదతీరుతున్నది అనాథాశ్రమాల్లోనే వయస్సు మళ్లిన దేహాలు, కాంతి లేను చూపులు, చిధ్రమైన జీవితాలు వీరివి. ఉదయాన్నే లేచి పేపరు చదివి, టీవీ చూస్తూ, అప్పుడప్పుడు చిన్ననాటి జ్నాపకాలను నెమరువేసుకుంటూ వేలకు మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కదిలే కాలంతో పరిగెత్తలేరు. కానీ కాలం తెచ్చిన కల్లోలానికి మాత్రం బలి అవుతూనే ఉన్నారు.

మంచానపడే నాటికి భుజానికెత్తుకునే బిడ్డ ఉండాలంటారు పెద్దలు. కానీ ఆ పెద్దలను, చూసుకోవాల్సిన పిల్లలు ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. కరోనా దాటికి వృద్ధులు ప్రతీ రోజు పదుల సంఖ్యల్లో రాలిపోతున్నారు. అందరూ ఉన్నా కరోనా మరణం అనాథ మరణమే. అలాంటిది ఆ వృద్ధుల పరిస్ధితి పట్టించుకునేదెవరు. వృద్ధాశ్రమాల్లో ప్రభుత్వాలు కరోనా టెస్టులు చేపిస్తున్నాయి. ఇక పాజిటివ్ వచ్చిన వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

ఏదేమైనా, బావితరాలకు మార్గం చూపి, చివరకు తమ మార్గమెంటనే భయాందోళనలో మగ్గుతున్నారు ఇక్కడి వృద్ధులు. ఓ వైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్యం వెంటాడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో బాధనెలా తట్టుకోవలా తెలియక పండుటాకులు తల్లిడిల్లుపోతున్నారు.

Full View


Tags:    

Similar News