JEE, NEET Exams : జేఈఈ, నీట్‌ను వాయిదా వేయండి : నవీన్‌ పట్నాయక్‌

JEE, NEET Exams : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే... వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో

Update: 2020-08-25 12:02 GMT

Naveen Patnaik 

JEE, NEET Exams : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే... వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి..ఈ క్రమంలో సెప్టెంబర్‌ 1 నుంచి నిర్వహించాల్సిన జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో పరీక్షల నిర్వహణ అంత మంచిది కాదని అయన ఆ లేఖలో వివరించారు.. అంతేకాకుండా ఒక వేళ పరీక్షలు నిర్వహించినట్లయితే ప్రజా రవాణా లేక విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పట్నాయక్‌ తన లేఖలో పేర్కొన్నారు..

ఇక ఒడిశా నుంచి దాదాపు 50,000 మంది నీట్‌ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. మరో 40,000 మంది జేఈఈ మెయిన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో ప్రజా రవాణా నిలిచిపోయిందని అయన అందులో పేర్కొన్నారు.. అటు ఒడిశా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 8 పట్టణాలను కూడా ఎంపిక చేసింది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలు వాయిదా పడవని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. ఇక జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.. సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్‌ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News