UGC Net Exam: యూజీసీ నెట్ పరీక్ష రద్దు..ప్రకటించిన ఎన్టీఏ.!

UGC Net Exam: యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-06-19 23:43 GMT

UGC Net Exam: నీట్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా మంత్రిత్వ శాఖ UGC-NET 2024 పరీక్షను రద్దు చేసింది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 18న నిర్వహించారు. యూజీసీ నెట్ పరీక్ష దేశంలోని యూనివర్సిటీల్లో లెక్ఛరర్షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ లలో ప్రవేశాలకు కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది.

యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు యూజీసీ నిర్థారణ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మంగళవారం 1,205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపుగా 11లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల్లో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

మరోవైపు వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్ పేపర్ లీకేజీపై వస్తోన్న ఆరోపణలపై కేంద్రం కూడా స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను ఇప్పటికే రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. పట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్ అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్లు, బీహార్ సర్కార్ తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.

కాగా ఈ అక్రమాలకు సంబధించి మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరీక్షకు 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 317 నగరాల్లోని 1205 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో మొత్తం 11,21,225 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 

Tags:    

Similar News