సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. ఇందులో చేరడానికి 70 సంవత్సరాల వరకు అవకాశం..

సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. ఇందులో చేరడానికి 70 సంవత్సరాల వరకు అవకాశం..

Update: 2022-03-15 06:45 GMT

సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. ఇందులో చేరడానికి 70 సంవత్సరాల వరకు అవకాశం..

NPS: సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. దీనిని మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఎప్పటికప్పుడు నియమ నిబంధనలని మారుస్తుంది. మారిన కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు వృద్ధులు ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. PFRDA అనేక కొత్త మార్పులను ప్రతిపాదించింది. NPS అన్ని మార్పులను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి గరిష్ట వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలకు పెరిగింది. అంటే 70 ఏళ్లలోపు వ్యక్తి ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

60 ఏళ్ల తర్వాత ఎన్‌పిఎస్‌లో చేరిన సబ్‌స్క్రైబర్‌లకు పిఎఫ్‌ఆర్‌డిఎ పెద్ద ఉపశమనం కల్పించింది. ఇప్పుడు 75 ఏళ్ల వరకు ఎన్‌పిఎస్ ఖాతాను కొనసాగించవచ్చు. కానీ ఇతర సబ్‌స్క్రైబర్‌లందరికీ మెచ్యూరిటీ పరిమితి 70 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుత చందాదారుల నుంచి పెద్ద సంఖ్యలో వ‌స్తున్న‌ అభ్యర్థన‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎఫ్ఆర్‌డీఏ త‌న స‌ర్కుల‌ర్‌లో పేర్కొంది. భారతీయ పౌరులు లేదా విదేశాల్లో నివాసం ఉంటున్న భారతీయ పౌరులు 18 నుంచి 70 సంవ‌త్సరాల వ‌య‌సు వారు చేరొచ్చు.

అంటే 65 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులో కూడా ఎన్‌పీఎస్‌లో చేరి 75 సంవ‌త్సరాల వ‌ర‌కు ఖాతాను కొన‌సాగించవ‌చ్చు. పాత నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఇప్పటికే ఖాతాను మూసివేసిన వారు కూడా తాజా స‌వ‌ర‌ణ‌ల‌తో తిరిగి కొత్తగా ఖాతాను తెర‌వ‌చ్చు. 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరే వారు పీఎఫ్‌, పెట్టుబ‌డుల‌ను కేటాయింపును చేయ‌వ‌చ్చు. అయితే ఈక్వీటీల‌లో గ‌రిష్టంగా..ఆటో ఆప్షన్‌ కింద 15 శాతం, యాక్టివ్‌ చాయిస్‌ ఆప్షన్‌ కింద 50 శాతం కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. పీఎఫ్‌ను సంవ‌త్సరానికి ఒక‌సారి, పెట్టుబ‌డుల కేటాయింపును సంవ‌త్సరానికి రెండు సార్లు మార్చుకోవ‌చ్చు.

సాధార‌ణంగా 3 సంవ‌త్సరాల త‌రువాత ప‌థ‌కం నుంచి బ‌య‌టకు వెళ్లచ్చు. అయితే 40 శాతం కార్పస్‌ను యాన్యూటి కొనుగోలుకి వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మొత్తం కార్పిస్ రూ. 5 ల‌క్షలు, అంత‌కంటే త‌క్కువ ఉంటే, చంద‌దారుడు సేక‌రించిన పెన్షన్ నిధి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. దురదృష్టవశాత్తు చందాదారుడు మరణిస్తే, కార్పస్ మొత్తం చందాదారుడి నామినీకి చెల్లిస్తారు. 

Tags:    

Similar News