వారికి అడ్రస్ ఫ్రూప్‌ లేకుండానే ఆధార్‌ కార్డ్‌.. యూఐడీఏఐ సంచలన నిర్ణయం..

Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్‌ వచ్చింది...

Update: 2022-03-03 08:30 GMT

వారికి అడ్రస్ ఫ్రూప్‌ లేకుండానే ఆధార్‌ కార్డ్‌.. యూఐడీఏఐ సంచలన నిర్ణయం..

Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్‌ వచ్చింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంటే ఆధార్ కార్డ్ జారీ కోసం వారి నుంచి ఏ ఇతర నివాస ధృవీకరణ పత్రం అడగదు. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ లేకుండానే సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డ్ అందుబాటులోకి రానుంది.

సెక్స్ వర్కర్ల విషయంలో UIDAI విపరీతమైన ఔదార్యాన్ని ప్రదర్శించింది. వారికి ఆధార్‌ కార్డ్‌ జారీ చేయడానికి నివాస రుజువును అడగకూడదని నిర్ణయించింది. దీంతో పాటు NACO లేదా రాష్ట్ర ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారి నుంచి సెక్స్ వర్కర్ పొందిన సర్టిఫికేట్‌ను అంగీకరిస్తుంది. NACO అనేది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఒక విభాగం. ఇది సెక్స్ వర్కర్లపై సెంట్రల్ డేటాబేస్ నిర్వహిస్తుంది.

ఈ అంశంపై 2011 నుంచి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. భారతదేశం అంతటా సెక్స్ వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ రావ్ విచారిస్తుండగా UIDAI ప్రతిపాదిత సర్టిఫికేట్ ప్రొఫార్మాను కోర్టుకి సమర్పించింది. సెక్స్ వర్కర్లకు సంబంధించిన పలు అంశాలను ఈ పిటిషన్‌లో పొందుపరిచారు. వ్యభిచారం నుంచి బయటపడాలనుకునే వారికి పునరావాస ప్రణాళికను సిద్ధం చేసే అంశం కూడా ఇందులో ఉంది. UIDAI తీసుకున్న ఈ నిర్ణయం సెక్స్ వర్కర్లకు సాధారణ జీవితాన్ని అందించడానికి చాలా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News