PAN Card: పాన్ కార్డ్ కరెక్షన్ ఇప్పుడు చాలా సులువు.. ఎలాగంటే..?
PAN Card: పాన్ కార్డ్ కరెక్షన్ ఇప్పుడు చాలా సులువు.. ఎలాగంటే..?
PAN Card: పాన్‌కార్డ్ ఉన్నవారికి ఇది చాలా అవసరమైన విషయమని చెప్పవచ్చు. చాలామంది పాన్‌కార్డ్‌లో తప్పులుంటాయి. వీటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చొని కరెక్షన్ సులభంగా చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి ఒక్కరికి పాన్‌కార్డ్ అవసరమవుతుంది. మీరు బ్యాంకు నుంచి 50 వేల రూపాయలు విత్‌డ్రా చేయాలన్నా డిపాజిట్ చేయాలన్నా పాన్‌కార్డు అడుగుతారు. అంతేకాదు పాన్‌కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పాన్‌కార్డులో తప్పులని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుందాం.
పాన్ కార్డ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని సరిదిద్దుకోవచ్చు. దీని కోసం మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో సరిచేయవచ్చు. మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో దిద్దుబాటు చేయాలనుకుంటే దీని కోసం సమీపంలోని పాన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించాలి. తర్వాత పాన్ కార్డ్‌లో దిద్దుబాటు జరుగుతుంది. మీరు పాన్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో కరెక్షన్ చేయాలనుకుంటే NSDL సర్వీస్ onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లేదా UTIITS సర్వీస్ UTIITSLని myutiitsl.com/PAN_ONLINE/CSFPANAppలో సందర్శించడం ద్వారా సరిచేయవచ్చు.
ఇక్కడ కూడా సంప్రదించవచ్చు
మీరు NSDLని 1800-180-1961, 020-27218080లో సంప్రదించవచ్చు. ఇది కాకుండా మీరు ఈ రెండు IDల efilingwebmanager@incometax.gov.in లేదా tininfo@nsdl.co.inలలో ఈ మెయిల్ కూడా చేయవచ్చు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి పాన్‌కార్డు అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.