Aadhaar: ఆధార్‌లో పేరు, చిరునామా మార్చడం ఈ యాప్‌తో చాలా సులభం..!

Aadhaar: ఆధార్‌లో పేరు, చిరునామా మార్చడం ఈ యాప్‌తో చాలా సులభం..!

Update: 2022-07-12 09:30 GMT

Aadhaar: ఆధార్‌లో పేరు, చిరునామా మార్చడం ఈ యాప్‌తో చాలా సులభం..!

Aadhaar: ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు ఏ పని జరగదు. అది ప్రభుత్వ పని అయినా, వ్యక్తిగతమైనా ఏదైనా ఆధార్ కావాల్సిందే. అన్ని చోట్లా ఆధార్ కార్డు తప్పనిసరి పత్రంగా మారింది. కానీ చాలామంది ఆధార్‌ కార్డుల్లో పేరు, చిరునామా తప్పుగా ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీటిని కచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఒక యాప్‌ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.

ఆధార్‌లో పేరు, చిరునామా మార్పుని mAadhaarApp ద్వారా సులభంగా చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి mAadhaarAppని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు 'రిజిస్టర్ మై ఆధార్'పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. అక్కడ మీకు OTP వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత మీరు mAadhaarAppకి లాగిన్ అవుతారు. తర్వాత మీరు యాప్‌లో మై ఆధార్‌ని చూస్తారు. అక్కడ మీ పేరు, ఆధార్ నంబర్ చివరి 4 అంకెలు కనిపిస్తాయి.

తర్వాత మీరు My Aadhaarపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ అప్‌డేట్ కాలమ్‌ను చూస్తారు. దీనిపై క్లిక్ చేయడం ద్వారా క్యాప్చాను ఎంటర్‌ చేసి, రెక్వెస్ట్‌ OTPపై క్లిక్ చేయాలి. తర్వాత మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీని మార్చడం కోసం ఒక అప్‌డేట్ విండో ఓపెన్‌ అవుతుంది. ఇందులో మార్పు చేసుకోవచ్చు. ప్రతి అప్‌డేట్‌కు రూ. 50 ఛార్జ్ అవుతుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News