Ration Card: రేషన్‌కార్డుదారులకు గమనిక.. ఇకనుంచి వారికి రేషన్ కట్..!

Ration Card: ప్రభుత్వం త్వరలో రేషన్‌కార్డు నిబంధనలని మారుస్తోంది. ఎందుకంటే చాలామంది అనర్హులు రేషన్‌కార్డు ద్వారా లబ్ధిపొందుతున్నారు.

Update: 2022-02-25 11:30 GMT

Ration Card: రేషన్‌కార్డుదారులకు గమనిక.. ఇకనుంచి వారికి రేషన్ కట్..!

Ration Card: ప్రభుత్వం త్వరలో రేషన్‌కార్డు నిబంధనలని మారుస్తోంది. ఎందుకంటే చాలామంది అనర్హులు రేషన్‌కార్డు ద్వారా లబ్ధిపొందుతున్నారు. దీనివల్ల అర్హులకు రేషన్‌కార్డులు అందకుండా పోతున్నాయి. కొత్త నిబంధనల ముసాయిదా దాదాపు సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని గురించి పలు రాష్ట్రాలతో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం.

ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీరిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ కొన్ని మార్పులు చేస్తుంది. వాస్తవానికి ఇప్పుడు కొత్త ముసాయిదా పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు.

ఇందుకు సంబంధించి గత ఆరు నెలలుగా రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహార, ప్రజాపంపిణీ శాఖ తెలిపింది. రాష్ట్రాలు ఇచ్చే సూచనలను పొందుపరిచి కొత్త నిబంధనలని సిద్దం చేస్తున్నారు. ఈ ప్రమాణాలు త్వరలో ఖరారు కానున్నాయి. కొత్త నిబంధనల అమలు తర్వాత అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. అనర్హులు ప్రయోజనం పొందలేరు. అవసరార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేస్తున్నారు.

ఆహార ప్రజా పంపిణీ శాఖ ప్రకారం.. ఇప్పటి వరకు 'ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్ (ONORC) పథకం' డిసెంబర్ 2020 వరకు 32 రాష్ట్రాలు, UTలలో అమలు చేస్తున్నారు. దాదాపు 69 కోట్ల మంది లబ్ధిదారులు అంటే NFSA కింద వచ్చే జనాభాలో 86 శాతం మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి నెలా దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు మారడం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

Tags:    

Similar News