DGCA : విమాన ప్రయాణానికి మాస్క్ తప్పనిసరి.. లేనిచో నో ఫ్లై జాబితాలోకి!
DGCA : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే... వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు
DGCA : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే... వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ క్రమంలో కరోనా అరికట్టడానికి మాస్క్ లను కచ్చితంగా ధరించాలని వైద్యులు చెబుతున్నారు.. కొన్ని రాష్ట్రాలు వీటిని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ని కచ్చితంగా ధరించాలని లేనిచో భారీ జరిమానాలను కట్టాలని నిబంధనలను కూడా విధించాయి..
ఇక విమాన ప్రయాణానికి మాస్క్ ధరిస్తేనే అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తేల్చి చెప్పింది. ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని స్పష్టం చేసింది. కేవలం నీరు త్రాగేప్పుడు, ఆహారం తీసుకునేప్పుడు లాంటి నిజమైన కారణాలతో మాత్రమే మాస్కుల తీసివేతకు అనుమతించింది. ఇంకేమైనా కారణలతో మాస్క్ ధరించకుండా ఇతర ప్రయాణికులకు ముప్పు కలిగించిన ప్రయాణీకులను నో ఫ్లై జాబితాలో ఉంచుతారని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 77,266 కేసులు నమోదు కాగా, 1057మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,177మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 33,87,500 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 7,42,023 ఉండగా, 25,83,984 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 61,529 మంది కరోనా వ్యాధితో మరణించారు.