కర్నాటకలో నేటి నుంచి నామినేషన్ల పర్వం

* ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

Update: 2023-04-13 03:10 GMT

కర్నాటకలో నేటి నుంచి నామినేషన్ల పర్వం

Karnataka: కర్నాటకలో నేటి నుంచి నామినేషన్ల పర్వానికి తెరలేవనుంది. గెజిట్ నోటిఫికేషన్ విడదలైన వెంటనే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల పత్రాలను స్వీకరించనున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10వ తేదీన పోలింగ్‌..మే 13న ఫలితాలు వెలువడనున్నాయి..

కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్ల మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58 వేల 282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ఓటు ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చని ఈసీ తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశముంది. 

Tags:    

Similar News