Salman Khan: సల్మాన్ కు మరోసారి బెదిరింపులు: ఒకరి అరెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్, జీషాన్ సిద్దిఖీని చంపుతామని బెదిరింపులు వచ్చాయి.

Update: 2024-10-29 06:08 GMT

Salman Khan

Salman Khan: సల్మాన్ ఖాన్, జీషాన్ సిద్దిఖీని చంపుతామని బెదిరింపులు వచ్చాయి. దిల్లీ నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 12న మాజీ మంత్రి, ఎన్ సీ పీ నాయకులు బాబా సిద్దిఖీని లారెన్స్ సిద్దిఖీ సభ్యులు చంపారు.

అక్టోబర్ 25న వీరిద్దరికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ బెదిరింపులపై జీషాన్ సిద్దిఖీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు. బెదిరింపులకు పాల్పడింది మహమ్మద్ తయ్యబ్ గా గుర్తించారు. గత వారమే సల్మాన్ ఖాన్ ను చంపుతామని జంషెడ్ పూర్ కు చెందిన షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్ కూడా బెదిరింపులకు దిగారు.

ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఈ మేసేజ్ పంపారు. ఈ మేసేజ్ పంపిన తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ బెదిరింపులపై సల్మాన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరిపి హుస్సేన్ ను అరెస్ట్ చేశారు.

1998లో రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడారనే ఆరోపణలపై సల్మాన్ ఖాన్ పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోపం పెంచుకొంది. ఈ కేసులో కోర్టు కేసులకు హాజరయ్యేందుకు రాజస్థాన్ వచ్చే సమయంలోనే ఆయనను చంపుతామని అప్పట్లోనే ఈ గ్యాంగ్ బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఇంటి బయట కాల్పులకు దిగారు. ఈ ఘటన జరిగిన మరో నెల రోజుకే నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ముంబై పోలీసులకు పట్టుబడ్డారు. సల్మాన్ ను చంపేందుకు వచ్చినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

Tags:    

Similar News