Lambda Variant: లామ్డా వేరియంట్ పై కేంద్రం కీలక ప్రకటన..

Lambda Variant: వివిధ దేశాలను కలవరపెడుతున్న లామ్డా వేరియంట్ను ఇప్పటివరకు భారత్లో గుర్తించలేదని కేంద్ర వైద్య‌ ఆరోగ్యశాఖ తెలిపింది.

Update: 2021-07-10 01:53 GMT

Lambda Variant:(The Hans India)

Lambda Variant: వివిధ దేశాలను కలవరపెడుతున్న లామ్డా వేరియంట్ ను ఇప్పటివరకు భారత్లో గుర్తించలేదని కేంద్ర వైద్య‌ ఆరోగ్యశాఖ తెలిపింది. లామ్డా వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ వేరియంట్ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటివరకైతే భారత్లో ఈ వేరియంట్ వెలుగు చూసిందనడానికి ఆధారాలు లేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. పెరూ దేశంలో 80 శాతం కేసులకు ఈ వేరియంట్ కారణమని,సౌత్ అమెరికా దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగుచూసిందని,యూకే,యూరప్ దేశాల్లో కూడా లామ్డా వేరియంట్ వెలుగులోకి వచ్చిందని,ప్రజాఆరోగ్యంపై ప్రభావం చూపే ఏదైనా మానిటర్ చేయబడుతుందని వీకే పాల్ తెలిపారు. జులై 8 నాటికి 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 66 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైందని అన్నారు.

వారం నుంచి 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడికి మరింత పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. అయితే, దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వీకే పాల్ చెప్పారు.కొత్త కేసుల్లో సగటున 8 శాతం తగ్గుదల మోదవుతున్నట్లు తెలిపారు. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్న ఆయన..

శుక్రవారం రికవరీ రేటు 97.2 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గర్భిణులు టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా నిబంధనలు మాత్రం ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా వీడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పర్యాటక ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి మరితం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Tags:    

Similar News