Pranab Mukherjee Health: విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి

Update: 2020-08-18 08:07 GMT

Pranab Mukherjee Health: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉంది. ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని తాజా బులెటిన్‌లో వెల్లడించారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అతనికి క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స తర్వాత కూడా ప్రణబ్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈనెల 10వ తేదీన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది.

Tags:    

Similar News