NEET-UG Counselling: ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్..తేదీలను ప్రకటించిన NMC

NEET-UG Counselling: NEET-UG కౌన్సెలింగ్ తేదీని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సోమవారం ప్రకటించింది. నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ ఆగస్టులో ప్రారంభమవుతుందని ఎంసీసీ తెలిపింది.

Update: 2024-07-30 00:09 GMT

NEET-UG Counselling: ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్..తేదీలను ప్రకటించిన NMC

 NEET-UG Counselling:మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నేడు (MCC) NEET-UG కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే తేదీని ప్రకటించింది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ...నోటీసు జారీ చేసి సమాచారం ఇచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024కి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టు నుండి ప్రారంభమవుతుందని MCC నోటీసులో పేర్కొంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024కి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుండి ప్రారంభించనున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కార్యదర్శి డాక్టర్ బి శ్రీనివాస్ నోటీసులో తెలిపారు. అలాగే, కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ ఆగస్టు మొదటి వారం నుండి ప్రారంభమవుతాని తెలిపారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం..నోటీసుల కోసం అభ్యర్థులు MCC వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.



శ్రీనివాస్ మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా సుమారు 710 మెడికల్ కాలేజీల్లో సుమారు 1.10 లక్షల MBBS సీట్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఇది కాకుండా, ఆయుష్, నర్సింగ్ సీట్లతో పాటు, 21,000 BDS సీట్లకు కూడా కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. MCC ఆల్ ఇండియా కోటాలోని 15 శాతం సీట్లు , అన్ని AIIMS, JIPMER పాండిచ్చేరి, అన్ని సెంట్రల్ యూనివర్శిటీల సీట్లు, 100 శాతం డీమ్డ్ యూనివర్శిటీల సీట్లకు 100 శాతం సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగిలిన 85 శాతం సీట్లకు కౌన్సెలింగ్‌ను రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు నిర్వహిస్తాయి. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన అనేక పిటిషన్‌లను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత, వివాదాలతో మెడికల్ ప్రవేశ పరీక్ష తుది ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది.

Tags:    

Similar News