ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

* రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం * డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం * రెండు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు * ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతావరణం-వాతావరణశాఖ

Update: 2020-11-29 07:50 GMT

Nivar Cyclone Updates : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా, ఆపై మరింత బలపడి తుపానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఇది పశ్చిమ దిశగా పయనించి డిసెంబర్ 2కు తమిళనాడు తీరాన్ని తాకుందని తెలియజేశారు వాతావరణ శాఖ అధికారులు.

డిసెంబరు ఒకటి, రెండు తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌, దక్షిణ కోస్తాంధ్రతోపాటు దక్షిణ రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురు వానలు కురుస్తాయని.. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.

Full View


Tags:    

Similar News