Nivar Cyclone Live Updates : ఇప్పటికే నివర్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చగా. మరో రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతంలో రెండు తుఫాన్‌లు ఏర్పడే అవకాశముంది. ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం క్రమంగా బలపడి బురెవి తుఫాన్‌గా మారే అవకాశముందన్నారు. డిసెంబర్ 2న తమిళనాడులో తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 145కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.