కీలక కమిటీలను ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు షాక్..
BJP హైకమాండ్ కీలక కమిటీలను ప్రకటించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్ వ్యవస్థీకరించింది.
BJP హైకమాండ్ కీలక కమిటీలను ప్రకటించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్ వ్యవస్థీకరించింది. ఈ బోర్డు నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని తొలగించారు. కొత్తగా కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప, శర్బానంద్ సోనోవాల్, తెలంగాణకు చెందిన డాక్టర్ కే.లక్ష్మణ్‌లకు చోటు కల్పించారు. ఈ బోర్డులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, యెడియూరప్ప, శర్బానంద్ సోనోవాల్, డాక్టర్ కే.లక్ష్మణ్, ఇక్బాల్ లాల్‌పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జాటియా, బీఎల్ సంతోష్ ఉన్నారు. ఇక బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా మార్పులు చేశారు. ఇందులో కొత్త మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు చోటు కల్పించారు. మొత్తం 15 మందితో కేంద్ర ఎన్నికల కమిటీని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.