Special Status: నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
Special Status: కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి మరోసారి బయటపడింది.
Special Status: కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి మరోసారి బయటపడింది. విభజన టైమ్ లో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చి ఆపై ముఖం చాటేసిన కేంద్ర ప్రభుత్వాలు ఏపీ గొంతు అడ్డంగా కోసేశాయి. ప్రత్యేక హోదా కోసం అడిగి అడిగి రాష్ట్ర ప్రభుత్వం గొంతెండి పోయింది కానీ ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేదు. కానీ తాజాగా బీహార్ పై మాత్రం కేంద్రానికి ప్రేమ పొంగుకొచ్చింది.
అభివృద్ధి నివేదికలలో అట్టడుగున ఉన్న బీహార్ ను ఇప్పుడు ఆదుకునే పనిలో పడింది కేంద్రం. గత కొన్నేళ్లుగా బీహార్ అద్భుతమైన పురోగతిని సాధించిందని, కానీ ఆర్ధిక దుస్థితి వల్ల ఆ ప్రగతి కనిపించడంలేదని నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ కు తగినంత సాయం చేసేందుకు నీతీ ఆయోగ్ సిద్ధంగా ఉందని, ప్రత్యేక హోదా డిమాండ్ ను పరిశీలిస్తున్నామని అన్నారు.