మోడీ కేబినెట్‌లో పిన్న వయస్సులోనే చోటు దక్కించుకున్న నిశిత్ ప్రమానిక్

ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు.. 2019లో బీజేపీలో చేరిన నిశిత్ ప్రమానిక్

Update: 2021-07-08 05:24 GMT

మోడీతో నిశిత్ ప్రమానిక్ (ఫైల్ ఫోటో) 

Cabinet Expansion 2021: కేంద్ర కేబినెట్ విస్తరణలో అతిచిన్న వయస్సులోనే స్థానం దక్కించుకున్నాడు పశ్చిమబెంగాల్ కు చెందిన ఎంపి నిశిత్ ప్రమానిక్. 2019లో బెంగాల్ లోని కుట్ బెహార్ నుంచి నిశిత్ ప్రమానిక్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకు ముందు నిశిత్ టీఎంసీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీని వదిలి బీజేపీలో చేరారు. ఎంపీగా ఉన్న సమయంలో బీజేపీ ఆయనను బెగాల్ దిన్హాట సీటు నుంచి పోటీ చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. పార్టీ నాయకత్వం సూచనలతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీసీఏ డిగ్రీ పూర్తి చేసిన నిశిత్ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ గా బాధ్యతలు నిర్వహించారు.

ప్రధాని మోడీ మంత్రివర్గంలో పశ్చిమబెంగాల్ కు చెందిన నలుగురు ఎంపీలు శాంతను ఠాకూర్, డాక్టర్ సుభాస్ సర్కార్, జాన్ బార్లా, నిషిత్ ప్రమానిక్ లకు కేంద్ర సహాయ మంత్రులుగా స్థానం దక్కింది. 35 ఏళ్ల నిశిత్‌ ప్రమానిక్‌ రాష్ర్టపతి వన్ లో ప్రధాని మోడీ సమక్షంలో నిషిత్ ప్రమానిక్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు కొత్తగా మంత్రివర్గంలో చేరినప్పటికీ నిషిత్ ప్రమానిక్ మాత్రం అతిపిన్నవయస్కుడుగా నిలిచారు.

నిశిత్ ప్రమానిక్ రాజవంశీ సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపారు. ఆయన కూడా రాజవంశీ సంఘం నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఉత్తర బెంగాల్‌లో బీజేపీ విస్తరణ వెనుక నిషిత్ ప్రమానిక్ హస్తం ఉంటుంది. 2018 లో బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా సుమారు 300 మంది స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టారు. వీరిలో చాలామంది గెలిచారు. ఆ తరువాత ఆయన ఫిబ్రవరి 2019 లో బీజేపీలో చేరారు. అదే సంవత్సరంలో పార్టీ కూచ్ బెహర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇచ్చింది.

Tags:    

Similar News