Nirmala Sitharaman: నాణ్యమైన విద్యే మోడీ ప్రభుత్వ లక్ష్యం

Nirmala Sitharaman: పన్నుల సంస్కరణలతో పురోగతి సాధించాం

Update: 2024-02-01 06:52 GMT

Nirmala Sitharaman: నాణ్యమైన విద్యే మోడీ ప్రభుత్వ లక్ష్యం

Nirmala Sitharaman: మోడీ నాయకత్వంలో నాలుగు వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. తమ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులను శక్తిమంతంగా చేసిందన్నారు. మా హయాంలోనే అందరికీ సామాజిక న్యాయం జరిగిందన్నారు...మన క్రీడాకారులు దేశం గర్వపడేలా చేశారని ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించారని నిర్మల ప్రశంసించారు.

కొత్త సంస్కరణలతో పారిశ్రామికవేత్తలు పెరిగారని నిర్మల తెలిపారు .మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచామన్నారు. మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లను కల్పించామన్నారు. రైతు బీమా ద్వారా 11.8 కోట్ల మందిని ఆదుకున్నామన్నారు. ముద్రా యోజనతో యువతకు 25 లక్షల కోట్ల రుణాలను ఇచ్చామన్నారు. స్కిల్‌ ఇండియా మిషన్‌తో కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించామన్నారు.

Tags:    

Similar News