Nirmala Sitharaman: వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద.. 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం
Nirmala Sitharaman: రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తాం
Nirmala Sitharaman: మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుందని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పీఎం ఆవాస్ యోజన పథకంలో పెద్ద పీట వేశామని, లబ్దిదారులలో 70 శాతం మంది మహిళల పేర్లపైనే ఇళ్లు అందజేశామని నిర్మల తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు.