పెట్రోధరలపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Update: 2021-03-05 12:15 GMT

పెట్రోధరలపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

పెట్రో రేట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెరుగుతున్న పెట్రో ధరలపై స్పందించిన నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులు వేస్తున్నాయన్నారు. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరిగితే సానుకూల ఫలితాలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఆదాయ లక్ష్యాన్ని ప్రభావితం చేయకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 8.5 రూపాయల మేర తగ్గించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి. హైదరాబాద్, విశాఖల్లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు, డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News