Union Budget 21-22: ధరలు పెరిగేవి..తగ్గేవి ఇవే
ఇప్పటికే భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగిన చమురు రేట్లు లీటర్ పెట్రోల్‌పై రూ.2.50 పైసలు లీటర్ డీజిల్‌పై రూ.4 పెంపు
బడ్జెట్‌లో ఊరట కోసం చూస్తున్న సామాన్యుల నడ్డి విరిచింది కేంద్రం. కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో మధ్య తరగతికి ఊరట కలిగించే ఎన్నో వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారు. కానీ.. అలా జరగలేదు. ఓవైపు కరోనా కారణంగా చాలా మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్నింటిని పెంచుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు.ఇప్పటికే భారీగా పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వీటి ధరలు మరింత పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయల 50 పైసలు, లీటర్ డీజిల్‌పై 4 రూపాయలు పెంచడంతో పేదవాడిపై మరింత భారం పడనుంది.
*సెల్‌ఫోన్లు, కార్ల విడిభాగాలు, చెప్పులు,..
*సోలార్ ఇన్వెర్టర్స్, లెదర్ వస్తువులు, కాటన్ దుస్తులు,..
*ఇంపోర్టెడ్ దుస్తులు, మద్యం, కాబూలీ శనగలు,..
*వంట నూనెలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, చేపలమేత,..
*గృహ నిర్మాణాల కోసం వాడే ప్లాస్టిక్, మెటల్ ప్రొడక్ట్స్,..
*ఎల్‌ఈడీ బల్బులు, ఇంపోర్టెడ్ వస్తువుల ధరల పెంపు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో పలు రంగాలపై ప్రభావం పడనుంది. సెల్‌ఫోన్ల ధరలు, కార్ల విడిభాగాలు, చెప్పులు, సోలార్ ఇన్వెర్టర్స్, లెదర్ వస్తువులు, కాటన్ దుస్తులు, ఇంపోర్టెడ్ దుస్తులు, మద్యం, కాబూలీ శనగలు, వంట నూనెలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, చేపలమేత, గృహ నిర్మాణాల కోసం వాడే ప్లాస్టిక్, మెటల్ ప్రొడక్ట్స్, ఎల్‌ఈడీ బల్బులు, ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి.
*బంగారం ప్రియులకు ఊరట
**తగ్గనున్న పసిడి, వెండి ధరలు
*నైలాన్ దుస్తుల ధరలు తగ్గే ఛాన్స్
*ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పుల్లేవు
*75ఏళ్లు పైబడిన పెన్షనర్లకు ఐటీ రిటర్న్స్ నుంచి మినహాయింపు
బంగారం ప్రియులకు ఊరట లభించింది. పసిడి, వెండి ధరలు తగ్గే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. కేవలం 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు మాత్రం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తానికి 2021-22 బడ్జెట్‌ను చూస్తే.. సగటు వేతన జీవికి నిరాశను మిగిల్చిందనే చెప్పుకోవాలి.
*మరింత పెరిగిన చమురు ధరలు
*లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, లీటర్ డీజిల్‌పై రూ.4 పెంపు
*సెల్‌ఫోన్లు, కార్ల విడిభాగాలు, చెప్పుల ధరలు పెంపు
*లెదర్ వస్తువులు, కాటన్ దుస్తుల రేట్లు పెంపు
*ఇంపోర్టెడ్ దుస్తులు, మద్యం, కాబూలీ శనగల ధరలు పెంపు
*వంట నూనెలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, ఎల్‌ఈడీ బల్బుల రేట్లు పెంపు
*బంగారం ప్రియులకు ఊరట
*తగ్గనున్న పసిడి, వెండి ధరలు
*నైలాన్ దుస్తుల ధరలు తగ్గే ఛాన్స్