Nipah Virus: కేరళను వణికిస్తోన్న నిఫా వైరస్.. కంటైన్మెంట్ జోన్లుగా 9 పంచాయితీలు
Nipah Virus: ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకే అనుమతి
Nipah Virus: కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది.. దేవభూమిలో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కోజికోడ్ జిల్లాలో కొత్త వైరస్ చాలా స్పీడ్‌గా ప్రభలుతోంది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో అధికారులు 9 పంచాయితీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.
కోజికోడ్‌లోని కంటైన్మెంట్ జోన్లలో ప్రార్ధనా స్ధలాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కంటైన్మెంట్ జోన్లన్నింటిల్లో ప్రార్ధనా స్ధలాలు సహా అన్ని బహిరంగ కార్యక్రమాలను నిలిపివేయాలని, ప్రజలు గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసరాలను విక్రయించే షాపులు, మందుల షాపులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.