NIA Raids: దేశవ్యాప్తంగా NIA రైడ్స్.. 17 ప్రాంతాల్లో తనిఖీలు

NIA Raids: పేలుడుతో ఉగ్రవాదులకు సంబంధం ఉందని అనుమానం

Update: 2024-03-05 04:47 GMT

NIA Raids: దేశవ్యాప్తంగా NIA రైడ్స్.. 17 ప్రాంతాల్లో తనిఖీలు

NIA Raids: బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది NIA. మంగళవారం ఉదయం ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలలో 17చోట్ల నేషనల్ ఇన్విస్టిగేషన్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. 2023లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయ్యారు. ఈ గతేడాది అనుమాతుల ఇళ్లల్లో సోదాలు చేయగా.. భారీగా ఆయుధాలు NIA అధికారులు గుర్తించారు.

ఈ ఏడాది జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన NIA ... నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఇటీవల రామేశ్వరం కేఫ్‌‌లో జరిగిన పేలుళ్లపై కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేశారు. పేలుడుతో ఉగ్రవాదులకు సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News