ప్రపంచ రికార్డు సృష్టించిన ఎన్‌హెచ్‌ఏఐ.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎన్‌హెచ్53 రోడ్డు
*ఐదు రోజుల్లో పూర్తి చేసిన ఎన్‌హెచ్‌ఏఐ *ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
NHAI: భారత జాతీయ రహదారుల సంస్థ-NHAI ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏకధాటికి ఐదు రోజుల్లో 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించింది. గల్ప్ దేశం ఖతార్ పేరిట ఉన్న రికార్డును NHAI బద్దలుకొట్టింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో ప్రకటించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు, గిన్నిస్ బుక్ ఇచ్చిన సర్టిఫికేట్‌ను ఆయన షేర్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకు జాతీయ రహదారి 53పై నిర్మాణ పనులను NHAI 4న ఉదయం 6 గంటలకు ప్రారంభించింది. మొత్తం 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసింది. దీంతో అతి తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల రోడ్డు పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది.
తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల రోడ్డును నిర్మించిన రికార్డు ఇప్పటివరకు గల్ప్ దేశం ఖతార్ పేరిట ఉండేది. ఆ దేశానికి చెందిన పబ్లిక్ వర్క్స్ అథారిటీ 2019 ఫిబ్రవరి 17న అల్-ఖర్ ఎక్స్‌ప్రెస్‌వేపై 75 కిలోమీటర్ల రోడ్డును నిర్మించింది. అయితే దీనికోసం పదిరోజుల సమయం తీసుకున్నది. కానీ NHAI ఐదు రోజుల్లో పూర్తి చేసి ఆ రికార్డును అధిగమించింది. అయితే NHAI తరఫున రాజ్‌పుత్ ఇన్‌ఫ్రాకాన్ అనే సంస్థ ఈ రోడ్డును నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పనుల్లో 800 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు పాల్గొన్నారు. అయితే గతంలో కూడా ఈ సంస్థ సాంగ్లీ-సతారా మధ్య 24 గంటల్లో రోడ్డు వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
Another world record in Road construction!
— Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2022
Record work on NH-53 between Amravati to Akola stretch, Maharashtra.#PragatiKaHighway #8YearsOfInfraGati #GatiShakti @narendramodi @PMOIndia @GWR pic.twitter.com/ii16Xr6YWX