NGT: సింగరేణి అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఆగ్రహం

NGT: సింగరేణి అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2021-07-17 12:12 GMT

NGT: సింగరేణి అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఆగ్రహం

NGT: సింగరేణి అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతుల్లేకుండా అదనపు మైనింగ్‌ చేస్తున్నారని మండిపడింది. నందు నాయక్‌, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారించగా అదనపు మైనింగ్‌పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా మైనింగ్‌ చేయొద్దని ఆదేశించింది. ఇప్పటివరకు చేపట్టిన అక్రమ మైనింగ్‌కు నష్టపరిహారం చెల్లించాలని సూచించింది.

కాలుష్య బారిన పడిన బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ. ఇక నివేదికలో గ్రీన్‌ బెల్ట్ మనుగడ రేటు బాగుందని పొందుపరిచారన్న ఎన్జీటీ ఎంత శాతం మనుగడ సాధించిన అంశాన్ని చెప్పలేదని తెలిపింది. మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రీన్‌ బెల్ట్ అంశంపై నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 12కి వాయిదా వేసింది.

Tags:    

Similar News