Corona: వచ్చే మూడు వారాలు కీలకం

Corona: కరోనా కట్టడికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు

Update: 2021-04-20 01:58 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona: కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సీసీఎంబీ అలర్ట్ చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌‌కు కీలకమని కరోనా కట్టడికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ క్రమంలో కొన్ని రకాలు బలహీనంగా ఉండి కనుమరుగైతే మరికొన్ని ఎక్కువ ప్రభావం చూపుతూ వ్యాప్తిలో ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండున్నర లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో కొత్తరకం కరోనా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి.

బి.1.617 రకం ఇతర వైరస్‌ రకాల కంటే ఎక్కువ వ్యాప్తికి కారణం అవుతుందనడానికి తగిన ఆధారాలు లేవు. దేశవ్యాప్తంగా దీని వ్యాప్తి ప్రస్తుతం10 శాతంలోపే ఉంది. ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ మ్యుటేషన్లతోపాటు మరికొన్ని బి.1.617లో ఉన్నాయి. భారత్‌లో ఈ రకం అక్టోబరులో బయటపడింది. అప్పట్లో ప్రజల జాగ్రత్తలతో వ్యాప్తి పెద్దగా లేదు. రెండు నెలలుగా చాలామంది మాస్క్‌ లేకుండా తిరగడం, టీకా వచ్చిందని జాగ్రత్తలను విస్మరించడం.. కేసులు పెరగడానికి దారితీస్తోందంటున్నారు వైద్యాధికారులు

భారత్‌లో ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతేడాది ఇటలీలో వైద్యం, ఆక్సిజన్‌ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతిపై కొన్ని నెలలుగా ఆరోగ్యరంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. టీకా తీసుకున్నా.. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు వైద్యాధికారులు. పార్టీల ర్యాలీలు, మతపరమైన మేళాలు అత్యంత ప్రమాదకరం. వీటితోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. గాలి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. భవనాలు, ఇతర ప్రదేశాల్లో 20 అడుగుల దూరం వ్యాపిస్తుంది. మాస్క్‌ ధరిస్తే 80 శాతం రక్షణ ఉంటుంది. అందరూ ధరిస్తే 99 శాతం రక్షణ లభిస్తుందని వివరించారు వైద్యాధికారులు.

Tags:    

Similar News