కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించించి ఆప్ సర్కార్. ఢిల్లీలో ఈ రాత్రి, రేపు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. నిబంధనలు పట్టించుకోకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశంలో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొత్త స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
భారత్‌లో బ్రిటన్ కొత్త వైరస్ స్ట్రెయిన్ విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25 కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అలెర్టయిన కేంద్ర ప్రభుత్వం న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన చర్చలను తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీంతో కర్ఫ్యూ సమయంలో ఎవరూ న్యూఇయర్ వేడుకలను ఇళ్ల బయట జరుపుకోకూడదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ స్థలాల్లో గుమికూడటం, సెలెబ్రేట్ చేసుకోవడం నిషేదమని కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించింది.