భారత కొత్త సైన్యాధిపతిగా మనోజ్ పాండే బాధ్యతలు

Manoj Pande: ఒక్కంగుళం భూభాగాన్ని కూడా చైనాకు వదిలేది లేదు

Update: 2022-05-02 00:48 GMT

భారత కొత్త సైన్యాధిపతిగా మనోజ్ పాండే బాధ్యతలు

Manoj Pande: భారత ఆర్మీ నూతన చీఫ్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు. భారత్-చైనా సరిహద్దులో ఇప్పుడున్న స్థితిని మార్చడానికి ఏమాత్రం అంగీకరించబోమన్నారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో అదనపు వ్యవస్థలు, బలగాలను మోహరించామని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించామని వివరించారు.

ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాలను వెల్లడించారు నూతన ఆర్మీచీఫ్. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నది సంప్రదాయ యుద్ధమేనని అభిప్రాయపడ్డారు. భారత్ విషయానికొస్తే దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Full View


Tags:    

Similar News