వారణాసిలో పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్న ప్రధాని మోడీ కొత్త వ్యవసాయ చట్టాలపై అపోహాలు సృష్టిస్తున్నారన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు.
కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చినా పాత విధానాలే అమల్లో ఉంటాయని ప్రధాని మోడీ వెల్లడించారు. విపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. ఈ చట్టం ద్వారా దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులు కూడా భవిష్యత్‌లో ఈ చట్టం ద్వారా లబ్ధి పొందుతారని వివరించారు.