ఇంగ్లాండ్‌లో కంగారు పెడుతున్న కొత్త వైరస్‌.. భారత్‌లోనూ డేంజర్‌ బెల్స్‌

* వారంలోనే లక్షా 73వేల 875 పాజిటివ్‌ కేసులు * ఈ నెల 17 నుంచి 24 వరకు మరో రెండు లక్షల కేసులు * స్ట్రెయిన్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

Update: 2020-12-26 06:42 GMT

ఇప్పటికే చైనాలో పుట్టిన కోవిడ్‌-19తో జనం అలకల్లోలం అవుతుంటే.. ఇప్పుడు కొత్త వైరస్‌ కంగారుపెడుతోంది. అంతేకాదు.. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కల్లోలం సృష్టిస్తోందోనన్న గుబులు రేగుతోంది. ఇంగ్లాండ్‌లో కరోనా వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తూ.. మరణమృదంగం మోగిస్తోంది. ఇక బ్రిటన్‌, సౌతాఫ్రికా సహా పలు దేశాల్లో వైరస్‌ తిష్టవేసింది.

 అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్‌. కానీ.. కంటికి కనిపించని శత్రువు మాత్రం ఒకే మాదిరగా విరుచుకుపడుతోంది. నవంబర్‌లో ఇంగ్లాండ్‌లో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌.. వేగంగా వ్యాపించింది. ముఖ్యంగా వైరస్‌ను నిలువరించేందుక ఎంత ప్రయత్నించినా.. పాజిటివ్‌ కేసులు పెరిగాయి. ఇక బ్రిటన్‌లో పరివర్తనం చెందిన కరోనా వైరస్‌.. యమా డేంజర్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు.

 ఎన్‌హెచ్‌ఎస్‌ గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లో లక్షా 73వేల 875 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అదేవిధంగా డిసెంబర్‌ 17 నుంచి 24వ తేదీ దాకా ఏకంగా రెండు లక్షల 75వేల 310 కేసులు నమోదయ్యాయి. ఇక త్వరలో ఈ కొత్త వైరస్‌ ప్రపంచమంతా డేంజర్‌ బెల్‌ మోగించనున్నట్లు తెలుస్తోంది.

 ఈ నేపథ్యంలోనే WHO కొత్త వైరస్‌పై చర్చించి.. ప్రపంచదేశాలను మరోసారి హెచ్చరించింది. అయితే అప్పటికే పలు దేశాల్లో బ్రిటన్‌ వైరస్‌ పాగా వేసింది. ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత యూకే నుండి భారత్‌కు రాకపోకలు పెరిగాయి. దీంతో ఓవైపు వ్యాక్సిన్‌ ఉందని ఒకింత ఉపశమనం కలిగిస్తున్నా.. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల భారత్‌లోనూ బ్రిటన్‌ వైరస్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. ప్రతి రాష్ట్రంలో ఈ వైరస్‌ జాడలు కనిపిస్తున్నాయి. కొందరికి పాజిటివ్‌ రావడంతో మరింత అలెర్ట్‌ అయ్యారు అధికారులు. దీంతో రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లెన్స్‌ జారీ చేసింది. స్ట్రెయిన్‌ పట్ల మునుపటికన్నా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Tags:    

Similar News