Delhi Corona Cases: ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా..ఇదే తొలిసారి
Delhi Corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసలు సంఖ్య తగ్గింది.
Delhi Corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య తగ్గింది. గతంలో ఢిల్లీలో ఏ ఆస్పత్రిలో చూసిన కరోనా రోగుల ఆర్తనాదాలే. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఢిల్లీ నెమ్మదిగా కుదుట పడుతోంది. లాక్‌డౌన్, కఠిన ఆంక్షల అమలుతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్తగా దిల్లీలో 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 15 తర్వాత అత్యల్ప కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 34మంది మృతి చెందారు.
మరోవైపు పాజిటివిటీ రేటు కూడా 0.5శాతానికి పడిపోయింది. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనాతో చనిపోయిన వారి 24,591కి చేరింది. రాష్ట్రం కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడిందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
ఒడిశాలో కొత్తగా 7002 కరోనా కేసులు నమోదవగా, 42 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,994 చేరింది. ఇక ఝార్ఖండ్‌లో కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనాతో చికిత్స పొందుతూ 12మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,046కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.