Drugs Case: గుజరాత్ భారీ డ్రగ్స్‌ కేసులో కొత్తకోణం

Drugs Case: కేసుతో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిన పోలీసులు

Update: 2021-09-21 03:39 GMT

Representational Image

Drugs Case: గుజరాత్ భారీ డ్రగ్స్‌ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుతో విజయవాడకు ఎలాంటి సంభందం లేదని తేల్చిచెప్పారు పోలీసులు. విజయవాడ పేరుతో ఎక్స్‌పోర్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ మాత్రమే నమోదు చేశారని, చెన్నైకి చెందిన సుధాకర్ దంపతుల పేరుతో కంపెనీ ఉందని స్పష్టం చేశారు. గుజరాత్ ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుకున్న డిఆర్ఐ అధికారులు పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీకి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు సమాచారం సేకరించారు.

డ్రగ్స్‌ మాఫియా వెనుక ఢిల్లీకి చెందిన కుల్‌దీప్‌సింగ్ అనే వ్యక్తి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌లోనే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్స్‌ రవాణా జరిగిందని, రాజస్థాన్‌ వాసి జయదీప్‌ లాజిస్టిక్ ద్వారా డ్రగ్స్‌ సరఫరా జరిగినట్టు గుర్తించారు డీఆర్‌ఐ అధికారులు. RJ 01 GB 8328 కంటైనర్‌ లారీలో డ్రగ్స్‌ తరలించినట్టు గుర్తించారు. తప్పుడు అడ్రస్‌లతో బియ్యం రవాణా ముసుగులో కుల్‌దీప్‌ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం సేకరించారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని, టాల్కం ఫౌండర్‌ పేరుతో గుజరాత్ ముంద్రా పోర్టు ద్వారా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. కుల్‌దీప్‌ను పట్టుకునేందుకు డీఆర్‌ఐ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. 

Full View


Tags:    

Similar News