NEP 2020: దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని ఉన్నతస్థాయి విద్య వరకు కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులను తీసుకొచ్చింది. విద్యాభ్యాసాన్ని మరింత సరళీకరించింది. విద్యార్థుల చదువులోనే కాకుండా ఉపాద్యాయులకు కూడా కొన్ని మార్గదర్శకాలు చేసింది. ప్రభుత్వ టీచర్లే కాకుండా ప్రైవేటు టీచర్లు కూడా టెట్ అర్హత సాధించాలని చెప్పడం చర్చనీయాంశం అయింది. దీనిపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.
నాణ్యమైన విద్య విద్యార్థి హక్కు అని జాతీయ నూతన విద్యా చెబుతోంది. జాతీయ నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌తో పాటు క్లాస్ రూమ్ టీచింగ్ లేదంటే ఇంటర్వ్యూని ఇందులో భాగం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికీ ఆ నిబంధనలను తప్పనిసరి చేసింది. ఈ ఇంటర్వ్యూ భాగంగా స్థానిక భాషలో వారికున్న ప్రావీణ్యాన్నీ పరిశీలిస్తారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రైవేటు టీచర్లు అందరూ టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని స్వాగతిస్తూనే ప్రభుత్వాన్ని కొన్ని పశ్నలు వేస్తున్నారు.
కొత్త విదానంలో పాఠశాల విద్యలో నాలుగు దశలు ఉన్నాయి. దానిలో అన్ని దశల్లో పనిచేసే గురువులకు టెట్‌ను విస్తరించున్నారు. అంటే శిశు తరగతులకు బోధించే వారికీ కూడా ఇది తప్పనిసరి అవబోతుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, కళలు, వృత్తి విద్యను చదువులో భాగం చేస్తామని పేర్కొన్న కేంద్రం నిపుణులను ఆయా పాఠశాలల్లో నియమించుకునే వెసులుబాటు కల్పించింది. స్థానికంగా ఉన్న ప్రముఖ వ్యక్తులనూ ఇన్‌స్ట్రక్చర్లుగా నియమించుకోవచ్చని తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత త్రీవంగా ఉన్నచోట పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించింది. బీఈడీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, ప్రతిభావంతులైన విద్యార్థులకు ముఖ్యంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ లో చేరే గ్రామీణ విద్యార్థులకు పెద్ద సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వబోతున్నారు. ఉపధ్యాయులు సమస్యలు పట్టించుకోకుండా ప్రతి ఏడాది టెట్ నిర్వహించకుండా ఈ నూతన విద్యా విధానాని ఎలా అమలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు టీచర్ల కు టెట్ ఉంచడం ఆహ్వానిస్తూనే ఎంత వరకు అమలు జరుగుతుందో చూడాల్సిన బాద్యత ఉందని నిరుద్యోగులు అంటున్నారు. అదే విదంగా ప్రతి సంవత్సరం కూడా టెట్ ను నిర్వయించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.