Supreme Court: నీట్ యూజీ పేపర్ విశ్వసనీయతను కోల్పోయింది
Supreme Court: తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసిన సుప్రీం
Supreme Court: నీట్ యూజీ పేపర్ విశ్వసనీయతన కోల్పోయిందన్నారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. నీట్ యూటీ పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. లీకైన పేపర్ ఎంత మందికి చేరిందో తేలాల్సి ఉందన్నారు. పేపర్ లీకేతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంని NTA సుప్రీంకోర్టుకు తెలిపింది. వారి నుంచి ఇంకెంత మందికి పేపర్ చేరిందో గుర్తించారా అని NTAని సుప్రీం ప్రశ్నించింది. పేపర్ లీక్ అనేది 23 లక్షల మంది విద్యార్థులతో ముడిపడిన అంశమన్న కోర్టు... జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని తెలిపింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను NTA ఇప్పటికే వాయిదా వేసింది.