నీట్ పేపర్ లీక్‌లో డాక్టర్స్ రోల్.. నలుగురు ఎయిమ్స్ డాక్టర్లను అరెస్ట్ చేసిన సీబీఐ
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్ డాక్టర్ల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్ డాక్టర్ల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో నలుగురు ఎయిమ్స్ డాక్టర్లను సీబీఐ అరెస్ట్ చేసింది. చందన్‌సింగ్, రాహుల్ ఆనంద్, కరణ్ జైన్, కుమార్ సాను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. నిందితుల గదులను సీజ్ చేసింది సీబీఐ. ల్యాప్‌టాప్, మొబైల్‌ను సీజ్ చేసింది. నలుగురు 2021 బ్యాచ్‌కు చెందిన వైద్యులుగా గుర్తించారు. ఈ నలుగురిని నేడు అధికారులు విచారించనున్నారు. నలుగురు నిందితులు పేపర్‌లీక్‌లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.