Assembly Polls: జమ్మూకశ్మీర్‌‌లో కొనసాగుతున్న తొలివిడత పోలింగ్‌

Jammu Kashmir Elections: జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.

Update: 2024-09-18 05:35 GMT

Jammu Kashmir Elections: జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో అన్ని పార్టీలు కశ్మీర్‌పై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్టికల్ 370 రద్దు, ప్రత్యేక రాష్ట్ర హోదా తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా 24 స్థానాలకు నేడు పోలింగ్ జరగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు ఈ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఈ ఎన్నికల్లో స్థానిక బలాలు, చారిత్రక నేపథ్యం, పార్టీ అనుబంధ ప్రాంతాలు కీలకంగా మారనున్నాయి. బీజేపీ అధికారం తమదే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. మరాజ్‌ రీజియన్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, శోపియాన్‌ జిల్లాలు, చీనాబ్‌ లోయలోని డోడా, కిశ్త్‌వాద్, రాంబన్‌ జిల్లాలు పోలింగ్‌ జరిగే వాటిలో ఉన్నాయి. బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్‌సీతో కాంగ్రెస్‌ జట్టు కట్టి పోటీకి దిగింది.

Tags:    

Similar News