Jaya Kishori: డబ్బు సంపాదించొద్దని నేను అనలేదు: క్లారిటీ ఇచ్చేసిన జయా కిశోరీ..
Jaya kishori: ఒకవైపు ఆధ్యాత్మిక బోధనలు.. మరోవైపు వ్యక్తిత్వ వికాస స్పీచ్ లు ఆధ్యాత్మికతలో కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు జయా కిశోరీ.
Jaya kishori: ఒకవైపు ఆధ్యాత్మిక బోధనలు.. మరోవైపు వ్యక్తిత్వ వికాస స్పీచ్ లు ఆధ్యాత్మికతలో కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు జయా కిశోరీ. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆధ్యాత్మిక బోధకురాలిగా పేరుపొందిన జయా.. ఇటీవల ఓ విమానాశ్రయంలో 2 లక్షల రూపాయల విలువైన డియోర్ బ్యాగ్ తో కనిపించి విమర్శల పాలయ్యారు.
తన గానంతో, ప్రసంగాలతో ప్రజలను ప్రేరేపిస్తోంది. జీవితానికి సంబంధించిన ఎన్నో విలువలను నేర్పిస్తుంది. విలువల గురించి, సద్గుణాల గురించి ప్రజలకు పాఠాలు చెబుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తున్నారంటే.. ఆమెవరో పెద్దావిడి అనుకుంటే పొరపాటే. ఆమె వయస్సు 29 ఏళ్లు. 1995 జులైలో రాజస్థాన్ లోని సుజన్ గఢ్ లో జన్మించారు. తన కుటుంబ ప్రోత్సాహంతో ఏడేళ్ల వయస్సులోనే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు జయా కిశోరీ.
భక్తి పాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షలాది మందిని ఆకర్షించారు. అందం, అభినయంతో పాటు ఆమె స్పీచ్ కూడా అలాగే ఉంటుందంటారు జయా ప్రసంగం విన్నవారు. ప్రజలు చూపు తిప్పుకోకుండా తన ప్రసంగాలతో కట్టిపడేస్తారని చెబుతుంటారు. అలాంటి జయా ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఎయిర్ పోర్టులో 2 లక్షలకు పైగా ఖరీదైన బ్యాగ్ ను ఆమె చేతిలో చూసి అందరూ షాక్ అయ్యారు. దీంతో జయా కిశోరీ లగ్జరీ లైఫ్ ను గురించి చర్చనీయాంశమైంది. ప్రజలకు చెప్పేది ఒకటి.. అనుసరిస్తున్న జీవితం మరోకటి అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
అయితే నెటిజన్ల కామెంట్స్ పై జయా కిశోరీ స్పందించారు. ప్రతిదీ మాయ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. డబ్బు సంపాదించొద్దు, అన్నింటిని త్యాగం చేయండి అని చెప్పలేదు. నేను చేయని వాటిని ఎలా చెబుతాను అన్నారు జయా కిశోరీ. నేను సాధ్విని కాదనే స్పష్టత నాకు మొదటి నుంచి ఉంది. ఇదంతా నెటిజన్ పబ్లిసిటీ అని చెప్పారు. తనను అనుసరించి విశ్వసించే వారి కోసమే ఈ వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకునేంత పిచ్చిదాన్ని కాదన్నారు. డబ్బు, వస్తువులపై వ్యామోహం ఉండకూడదనేలా ఆమె బోధనలు ఉంటాయి అంటూ కామెంట్లు పెట్టిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చానన్నారు జయా కిషోరీ.