Uttarakhand: లోయలో పడిన బస్సు.. 22 కి పెరిగిన మృతుల సంఖ్య
Uttarakhand: ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22 కి చేరింది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 22 కు చేరింది. పదుల సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. అల్మోరా జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడింది. సంఘటన స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.పౌరీ జిల్లాలోని రామ్ నగర్ వైపునకు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అధికారులపై వేటు
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం సీరియస్ అయ్యారు. పౌరీ, అల్మోరా జిల్లాలకు చెందిన ఏఆర్ టీ ఓ అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన కోరారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆయన తెలిపారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
ఉత్తరాఖండ్ డిప్యూటీ సీఎం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. గాయపడినవారికి రూ. 1 లక్ష చొప్పున అందిస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ నిర్వహించాలని ఆయన కుమాన్ డివిజన్ అధికారులను ఆదేశించారు.